సలీం పాషా మరణం టీఆర్ఎస్‌కు తీరని లోటు- మంత్రి కొప్పుల

40
Minister Koppula

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామ వాస్తవ్యులు, టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు, మరియు ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు కొనసాగుతున్న సలీం పాషా గత కొంత కాలం నుండి అనారోగ్యం బాధపడుతూ శనివారం మరణించారు. పాషా మృతి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీ కి తీరని లోటు అన్నారు.

సలీం పాషా ప్రస్తుతం జిల్లా పరిషత్ కో ఆప్షన్ కొనసాగుతున్నారు. రెండు సార్లు మండల కో ఆప్షన్ సభ్యులుగా పని చేసారు. సలీం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని మంత్రి గుర్తు చేసుకున్నారు, ఆయన మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.