మంత్రి సత్యవతిని కలిసిన పాలమూరు యూనివర్సిటీ వీసీ..

41

పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీసీగా నియామకమైన లక్ష్మీ కాంత్ రాథోడ్‌ను మంత్రి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీని అన్ని విధాల ఉన్నత ప్రమాణాలతో నిర్వహించాలని మంత్రి సూచించారు. అక్కడ చదివే ప్రతి విద్యార్థిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, ఈ రాష్ట్రానికి, యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.