మాజీ సీఎం లాలూ కు షాక్ ….సీబీఐ రైడ్స్!

88
LALU
- Advertisement -

బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో స్కామ్ లో చిక్కుకున్నారు. ఆయన తో పాటు ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రూ. 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారన్న సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉండగా, ఇంతలో మరో స్కామ్ లో చిక్కుకున్నారు లాలూ.

2004 నుండి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయం లో, ఆర్ ఆర్ బీ రిక్రూట్‌మెంట్‌ లో ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో వారిద్దరిపై సీబీఐ మరో కొత్త కేసు నమోదు చేసింది.

ఈ కేసులో భాగంగా లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సీబీఐ పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్‌, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెల్సింది.

- Advertisement -