12వ సారి ఆర్జేడీ చీఫ్‌గా లాలూ

93
- Advertisement -

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం రికార్డు స్థాయిలో 12వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు దేశ రాజధానిలోని పార్టీ కార్యాలయంలో లాలూ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఆర్జేడీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఉదయ్ నారాయణ్ చౌదరి మాట్లాడుతూ… ఆర్జేడీ ఛీఫ్‌గా లాలూ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. తద్వారా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన అక్టోబర్‌లో జరిగే సమావేశంలో…లాలూ పార్టీ చీఫ్‌గా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ కూడా అందజేస్తామని చౌదరి తెలిపారు.

1997లో జనతాదళ్‌నుండి విడిపోయి న్యూఢిల్లీలో రాష్ట్రీయ జనతాదళ్‌ను స్ఠాపించారు. 25 ఏళ్ల పాటు లాలూ యాదవ్‌ 11సార్లు ఆర్జేడీ అధినేతగా ఎంపికయ్యారు. తాజాగా మరోక సారి పార్టీ అధినేతగా ఎంపికయ్యి బీహర్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.

- Advertisement -