‘క్యాలీ ఫ్లవర్‌’ సాంగ్‌ రిలీజ్‌ చేసిన అల్లరి నరేష్‌..

15

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను హీరో అల్లరి నరేష్‌ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. “కిల్ బిల్ కళాకార్ సంపూర్ణేషుడు.. జిల్ జిల్ జిగా జిగా మండే సూర్యుడు.. హల్ చల్ చేస్తున్నాడు ఈ ఆండ్రాయుడు.. క్రేజీ క్యాలీ ఫ్లవర్ నామధేయుడు” అంటూ ఈ పాట జోరుగా హుషారుగా సాగుతోంది. ప్రజ్వల్ క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా సాకేత్ ఆలపించాడు. ఈ పాటకి శశి మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.

గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా సంపూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

#KillBill Lyrical | Cauliflower Songs |Sampoornesh Babu, Vaasanthi | RK Malineni | Prajwal Krish