ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ..

25

దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక వాయు కాలుష్యం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. బుధవారం ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. గత కొన్ని రోజుల నుంచి గాలి నాణ్యత క్రమంగా మెరుగవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపించారు. ఢిల్లీకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆమోదయోగ్యమైన స్థాయి ఏమిటో సుప్రీంకోర్టు నిర్వచించాలని తెలపింది. ఆ తర్వతే పిటిషన్‌పై తాము తుది ఆదేశాలు ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్రత ఉన్నంత కాలం ఈ విషయాన్ని దాదాపు ప్రతిరోజూ విచారించాలని ధర్మాసనం పేర్కొంది.

వచ్చే రెండు మూడు రోజులు కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోండని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ఈలోగా కాలుష్యం 100కు చేరితే కొంత నిషేధాన్ని ఎత్తివేయవచ్చన్న సుప్రీంకోర్టు తెలిపింది. యంత్రాలతో పంట కోతలు.. మొదళ్ల నుంచి జరగని కారణంగానే వ్యర్థాల దహనం చేస్తున్నారన్నది పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ వాదన వినిపించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, న్యాయమూర్తులుగా దీనిపై చర్చిస్తున్నామన్నారు.

అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? వారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు చేయండి. ఇది ఎందుకు జరగదు అని ప్రశ్న సీజేఐ ప్రశ్నించారు. పంట వ్యర్థాల దహనం అంశం తాను చేపడితే 101 వాదనలు వస్తాయి.. కానీ ఫలితం ఉండదని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.