మంత్రి ఐకే రెడ్డికి ఆర్యవైశ్యుల ఆహ్వానం..

20

ఈ నెల 27 న నిర్మల్ పట్టణంలోని సూర్య కుటీర్, సాకెర రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన రమా సహిత సత్యనారాయణ, శివ పంచాయితన వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని జిల్లా ఆర్యవైశ్య బృందం ఆహ్వానించారు. బుధవారం నిర్మల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆర్య వైశ్య బృందం ఆమెడ కిషన్, లింగం పల్లి లక్ష్మీ నారాయణ, చిల మంతుల సంజీవ్ గుప్తా, నూకల దయాకర్, చిటికేశి మహేందర్, పుల్లూరు వెంకటేష్, జొన్నల మహేష్, గందే సునీల్, పడిగేలా రాం నారాయణ్, మోరేశ్వర్ RTD SI ,పులూరు రాజా కిషన్,తదితరులు ఉన్నారు.