డార్లింగ్‌ లేకుంటే ‘బాహుబలి’ లేదు

155
Can’t think of anyone else for Baahubali

తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటి  ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి  దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది.  బాహుబలి ది బిగినింగ్‌ చిత్రానికి కొనసాగింపుగా ఏప్రిల్‌ 28న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్వత్రా ఆసక్తి రేపుతున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇందుకు రెండో భాగం సమాధానమివ్వనుంది.

Can’t think of anyone else for Baahubali

ఐమ్యాక్స్‌లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఐమ్యాక్స్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ లేకుంటే బాహుబలి చిత్రం లేదనీ  జక్కన్న తెలిపారు.ఈ సినిమా కోసం ప్రభాస్‌ కనబరిచిన అంకితభావాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇదే అతడ్ని చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోగా నిలబెడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కన్నా తానేమీ గొప్ప వ్యక్తిని కాదని ఆయన వినమ్రయంగా చెప్పుకొచ్చాడు.  ఫస్టాఫ్‌ తెరకెక్కించే సమయంలోనూ, విడుదలైన సందర్భంలోనూ చాలా చాలా భయం వేసింది. కానీ రెండో భాగంలో విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రెండేళ్లలో ‘బాహుబలి’కి విశేష ప్రజాదరణ లభించడమే అందుకు కారణమని తెలిపారు.

నా కన్నా కూడా బాహుబలి సినిమా చాలా ఎక్కువ, సినిమా కన్నా బాహుబలి ప్రాంచైజీ ఇంకా పెద్దది . మేమిద్దరం ‘బాహుబలి’ అనే భారీ నావలో ప్రయాణిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కన్నా నేనేమీ గొప్ప వ్యక్తి కాను’ అని రాజమౌళి పేర్కొన్నారు.