జనవరి 18న మాల్యాకు శిక్ష ఖరారు..

127
supreme court

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చుక్కేదురైంది. బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న విజయ్ మాల్యా కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని…విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు విజయ్ మాల్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.