బీఎస్‌ఎన్‌ఎల్… 27 కే అన్‌లిమిటెడ్ కాల్స్..!

280
BSNL Rs. 27 Recharge Offer
- Advertisement -

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్‌, ఐడియా ఇంకా వోడఫోన్‌ల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డేటావినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ రూ.27 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 1జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు.

BSNL Rs. 27 Recharge Offer

జియోలో ఇదే తరహా ప్లాన్ రూ.52లకు లభిస్తుండగా అందులో 7 రోజుల వాలిడిటీతో 1.05 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 70 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అలాగే జియోలో రూ.49 ప్లాన్‌లో 1 జీబీ డేటా, 50 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిడెట్ కాల్స్ వస్తాయి. ఇక ఎయిర్‌టెల్‌లో రూ.47 ప్లాన్‌లో 150 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ కాల్స్, 50 ఎస్‌ఎంఎస్‌లు, 500 ఎంబీ డేటా లభిస్తాయి. జియో, ఎయిర్‌టెల్‌లలో ఉన్న ప్లాన్లకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

- Advertisement -