హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..

219

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనుటకు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు ఘనస్వాగతం పలికారు.

President Ram Nath Kovind

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కే.స్వామి గౌడ్ , రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , టి. పద్మారావు గౌడ్ , పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

President Ram Nath Kovind

అనంతరం రాష్ట్రపతి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శిస్తారు.

President Ram Nath Kovind