రిలయన్స్ జియో ప్రస్తుత టెలికాం రంగానికి చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.171 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.
అయితే 171తో రీచార్జ్ చేసుకున్న వారికి ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు. జియోలో రూ.198 ప్లాన్‌లో దాదాపుగా ఇదే తరహా బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. కాకపోతే ఆ ప్లాన్ వాలిడిటీ కొన్ని రోజులు తక్కువగా ఉంది. రూ.198 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌కు పోటీగానే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.171 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.