‘వీరభోగవసంతరాయలు’లో సుధీర్ బాబు లుక్..!

291
Sudheer Babu look
- Advertisement -

వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు.. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ కల్ట్ ఈజ్ రైజింగ్ ‘ అనేది టాగ్ లైన్..

ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు..

Sudheer Babu

తారాగణం : నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు.. సాంకేతిక నిపుణులు : దర్శకుడు: ఇంద్రసేన ఆర్, నిర్మాత: అప్పారా బెల్లన, బ్యానర్: బాబా క్రియేషన్స్, సంగీతం: మార్క్ కె రాబిన్, డీఓపీ : ఎస్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్ : శశాంక్ మాలి, యాక్షన్: రామ్ సుంకర, పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను, పిఆర్‌ఒ: వంశీ శేఖర్.

- Advertisement -