తెలంగాణ…5జీ సేవలున్న పట్టణాలు

24
- Advertisement -

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్  హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 331నగరాలు/పట్టణాల్లో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు టెలికం దిగ్గజం వెల్లడించింది. కాగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల జాబితా తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయి.

తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లోని అదనంగా మరో 27నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి వచ్చాయి. కాగా తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాల్లో ఉండగ్గా ప్రస్తుతం మరో 8పట్టణాలకు విస్తరించింది. అవి జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌ పట్టణాలు ఉన్నాయి. ఇక

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అనకాపల్లి, మచిలీపట్నం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంతకల్, గుంటూర్, హిందూపూర్, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, నంద్యాల్, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తెనాలి, తిరుమల, విజయనగరంతో పాటుగా తాడిపత్రిలో సర్వీసులు మొదలైనట్టు జియో సంస్థ ప్రకటించింది. 2023నాటికల్లా దేశవ్యాప్తంగా జియో 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్‌అంబానీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

వామ్మో.. నల్ల జీలకర్రతో ఎన్ని ఉపయోగాలో !

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

కమలాన్ని కలవర పెడుతున్న.. సౌత్ పాలిటిక్స్!

- Advertisement -