అక్క తమ్ముడు ఆస్తి పంపకాల్లో కుక్క బలి

223
dog

ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం అక్క తమ్ముడు కోట్లాటలో మధ్యలో వచ్చిన కుక్క బలి అయ్యింది. ఆస్తీ కోసం ఇద్దరు పోట్లాడుతుండగా మధ్యలో కుక్క రావడంతో కుక్క మెడపై కాలు పెట్టి తొక్కారు. దీంతో కుక్క అక్కడికక్కడే మరణించింది.

కుక్క చనిపోవడంతో తమ్ముడిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది రాణి. ఫిర్యాదు మేరకు కేసు అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం కుక్క డెడ్ బాడీని నారాయణగూడ లోక ఓ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.