కేంద్రపండగల జాబితాలో బోనాలు..

145
bonalu
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో బోనాలను చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలో ఎక్కడాలేని విధంగా బోనాలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని వెల్లడించారు. పంటలను రక్షించాలని, రోగాల నుంచి రక్షించాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని వెల్లడించారు.

తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని, గత ఏడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయిందని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -