కృతి శెట్టి….24 క్యారెట్ల బంగారం

24
krithi

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉప్పెన రేపిన బ్యూటీ కృతిశెట్టి. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టగా కృతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది కృతి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన అందచందాలకు పనిచెబుతూనే ఉంది ఈ అందాల భామ.

తాజాగా డిసెంట్‌ లుక్‌తో ఉన్న స్టిల్‌ని రిలీజ్‌ చేయగా 24 క్యారెట్ల బంగారం అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తూన్నారు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్‌లో నటించిన కృతి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దీంతో పాటు సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాగార్జున ప్రధాన పాత్రలో నటించనున్న ‘బంగార్రాజు’,నితిన్ హీరోగా వీఆర్‌ శేఖర్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపేసింది కృతి.