ఈ సారి రష్మీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’.. టీజ‌ర్

25
Bomma Blockbuster

హీరో నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించాడు. ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో, పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. నందు, ర‌ష్మీల పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. రష్మీ, నందుల‌ లవ్ ఇంట్రెస్ట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి అకట్టుకునే టీజ‌ర్ విడుద‌ల చేశారు మేకర్స్‌, టీజర్‌ చూస్తుంటే మూవీ కొంత లవ్, కొంత కామెడీ మరికొంత యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే చిత్ర‌ టైటిల్‌కి త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ప‌క్క‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

Bomma Blockbuster Teaser | Nandu Vijay Krishna | Raj Virat | Prashanth R Vihari | Vijaieebhava Arts