నందు…బొమ్మ బ్లాక్‌బస్టర్‌ ఫస్ట్ లుక్

172
hero nandu

యంగ్ హీరో నందు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది విజయీభవ ఆర్ట్స్‌. రాజ్ విరాట్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టైటిల్ ఖరారు చేయగా పోతురాజుగా నందుని పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నందు…దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నటిస్తున్నారు. నందు సరసన రష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రం షూటింగ్ తోపాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని విడుద‌లకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.