నిమిషంలో 100 పుషప్స్ తీసిన మంత్రి..

100
minister srinivas goud

ప‌రిశుభ్ర‌త‌, శారీరక ధారుడ్యం ప్రాముఖ్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్ ఇండియా- ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాలో పుల్లెల గోపిచంద్, చాముండేశ్వ‌రీనాథ్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

‌ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే విధంగా కేవ‌లం 60 సెకండ్ల‌లో 100 పుషప్స్ తీసి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ప‌టిష్ట‌మైన ఆరోగ్యం కోసం ప్ర‌తి ఒక్క‌రూ పుష‌ప్ప్ చేయాల‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రజలు, క్రీడకారులు రోజు వారి జీవితంలో శారీరక శ్రమలు మరియు క్రీడలు భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలు, క్రీడాకారులు ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.