సోలిపేట ఆశయాలను సాకారం చేస్తాం: మంత్రి హరీష్ రావు

274
harishrao

సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను సాకారం చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో సోలిపేట రామలింగారెడ్డి యాదిలో స్వప్న సాధకుడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌…ఒకే జీవితంలో మూడు అవతారాలు సక్సెస్ ఫుల్ గా చూశారని అన్నారు. వామపక్ష భావ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ప్రజాప్రతినిధిగా ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు.అధికారంలో ఉన్నా సమస్యలుంటే ప్రతిపక్ష పాత్ర పోషించేవారన్నారు.

ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇదంతా మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు విజయవంతంగా నిర్మించుకోవడం వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. దుబ్బాకకు రామలింగారెడ్డి తాగు నీరందించారు. సాగు నీరందించే చివరి దశలో వారు లేక పోవడం బాధాకరమన్నారు.

రాష్ట్రమంతా నీళ్లు పొంగిపొర్లుతున్నా ఇంకా సింగూరు నిండలేదు. కాళేశ్వరం ద్వారా గోదావరి దారను మంజీరాతో కలిపి దాన్ని జీవధారగా మార్చే బృహత్తర ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతేడాది 27 లక్షల వరి సాగు జరిగితే ఈ సారి 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని వివరాలను వెల్లడించారు.