బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్.. సూపర్‌ మెలోడీ సాంగ్‌..

277
Raaye Nuv Raaye Lyrical
- Advertisement -

హీరో నందు విజ‌య్ కృష్ణ‌, డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం బొమ్మ ‌బ్లాక్ బ‌స్ట‌ర్. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజ‌ర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి సూపర్‌ మెలోడీ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాట‌లో ఉంది.

కాగా, రాయే నువ్వు రాయే.. అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా న‌టిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని విడుద‌లకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

- Advertisement -