ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీనివాస్తవ అంటే ఎవరికి తెలియదు. కానీ గజోధర్ భయ్య అంటే బాలీవుడ్‌లోనే కాదు భారతదేశమంతటా పాపులరైన రాజు శ్రీవాస్తవ బుధవారం కన్నుమూశారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు ప్రకటించారు. కాన్పూర్‌లో 25 డిసెంబర్ 1963న జన్మించిన రాజు శ్రీవాస్తవ తండ్రి రమేశ్ చంద్ర శ్రీవాస్తవ. హాస్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రాజు శ్రీవాస్తవను గజోధర్ భయ్యాగా పిలుచుకుంటారు. ఈ పేరుతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు.
1982లో రాజు శ్రీవాస్తవ సినిమా ఆవకాశాల కోసం ముంబైకి చేరిన మొదట్లో ఆటోరిక్షాతో తన జీవితంను ప్రారంభించారు. అనేక ఒడిదుడుకుల తర్వాత అనిల్ కపూర్ తేజాబ్ ద్వారా శ్రీవాస్తవ బాలీవుడ్‌లోకి అడుగుపెటారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రం మైనే ప్యార్ కియా చిత్రంలో ట్రక్ క్లీనర్ పాత్రను పోషించారు. అలాగే షారుఖ్ ఖాన్‌తో కలిసి బాజీగర్ చిత్రంలో కాలేజీ విద్యార్థి పాత్రలో కూడా నటించారు. రాజు శ్రీవాస్తవ చాలా చిత్రాల్లోనే నటించినా మంచి ఫేమ్ రాలేదు.
2005లో స్టార్ వన్‌లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో రాజు శ్రీవాస్తవ పాల్గొన్నగా.. ఆ షోజు రాజు శ్రీవాస్తవ జీవితాన్నే మార్చి వేసింది. ఈ షో ద్వారా చాలా పాపులారిటీ సంపాదించారు. అనతి కాలంలోనే ఎదిగి రాజు శ్రీవాస్తవ కామెడీ కింగ్‌గా మారి గజోధర్ భయ్యాగా పేరు మార్చుకున్నారు. కామెడీ షో మహా ముఖబలా, నాచ్ బలియే వంటి షోల్లోనూ కనిపించారు. రాజు శ్రీవాస్తవ తన భార్యతో మొదటిసారిగా నచ్ బలియేలో కనిపించారు.