బాహుబలి 2ని బ్రేక్ చేసిన ఛావా!

27
- Advertisement -

హిందీ చలన చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌కి కేరాఫ్‌గా మారింది ఛావా. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ – రష్మికా మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బీటౌన్​లో అనేక రికార్డులు సృష్టించింది. తాజాగా హిందీ ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించింది ‘ఛావా’. హిందీలో ‘బాహుబలి 2’ సుమారు రూ.510 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా ఛావా రూ.516 కోట్లు వసూళ్లు చేసింది. కేవలం 25 రోజుల్లోనే బాలీవుడ్‌లో ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించింది. తెలుగులోనూ ఛావా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

రిలీజైన మూడు రోజుల్లోనే 9.46 కోట్లు వసూల్ చేసింది. విడుదలై నెల కావొస్తున్న ఛావా వసూళ్ల సునామీ మాత్రం తగ్గడం లేదు.

Also Read:సూర్యాపేటలో నకిలీ డీఎస్పీ …అరెస్ట్

- Advertisement -