ఇర్ఫాన్ ఖాన్ మృతి.. బాలీవుడ్ దిగ్భ్రాంతి..

440
Actor Irrfan Khan
- Advertisement -

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, ఈ ఉదయం ముంబయిలో కన్నుమూయడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇర్ఫాన్ త‌ల్లి ‌సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు.

త‌ల్లి చ‌నిపోయి కొద్ది రోజులు కూడా కాక‌ముందే ఇర్ఫాన్ ఇలా ఆక‌స్మాత్తుగా క‌న్నుమూయ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత అవుతున్నారు.ఆయ‌న మృతితో బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్ధించారు. ఇర్ఫాన్ చివ‌రిగా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు.

Irrfan Khan

కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ‘పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివ‌రిగా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించాడు.

ఆయన నటించిన ఇతర హిట్ చిత్రాల్లో ‘ది నేమ్‌సేక్’, ‘సలాం బాంబే’, ‘కమలాకీ మౌత్’, ‘జజీరే’, ‘లైఫ్ అఫ్ పై’ ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’, ‘హిస్’, ‘జురాసిక్ వరల్డ్’ తదితరాలున్నాయి. తెలుగులో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సైనికుడు’ చిత్రంలో విలన్ గా ఇర్ఫాన్ నటించి మెప్పించారు. ‘ది జంగిల్ బుక్’ చిత్రంలో బబ్లూ పాత్రకు గాత్రదానాన్ని కూడా చేశారు.

- Advertisement -