బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ మరాఠీలో అరంగేట్రం చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు నటుడు మహేష్ మంజ్రేకర్ రూపొందించిన వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వసీమ్ ఖురేషి నిర్మించారు. ఇందులో అక్షయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించనున్నారు. ఇందుకోసం సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్ పోస్ట్ చేశాడు.
1674లో శివాజీ స్వరాజ్యం గురించి కలలు కన్న ఏడుగురు వీర యోధుల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను 2023 దీపావళీకి విడుదల చేయనున్నారు. వీసాజీ బల్లాల్, దీపోజీ రౌత్రావ్, విఠల్ పిలాజీ ఆత్రే, కృష్ణాజీ భాస్కర్, సిద్ధి హిలాల్, విఠోజీ షిండే, సర్నౌబత్ కుడ్తోజీ అలియాస్ ప్రతాప్రావు గుజార్ పాత్రలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రముఖ మరాఠీ నటుడు జయ్ దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్ మరియు ప్రవీణ్ టార్డే కీలకపాత్రలు పోషించారు. మరాఠీ హిందీ తెలుగు తమిళం భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ… ఇది నేను కలలు కన్న పాత్ర. ఈ పాత్రను పోషించమని రాజ్ సర్ నన్ను అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ పాత్ర పోషించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని పెద్ద తెరపై చూపించడం చాలా పెద్ద బాధ్యత అని నేను భావిస్తున్నాను. దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌తో మొదటిసారి పని చేస్తున్నాను.
ఇవి కూడా చదవండి…