కోలీవుడ్ స్టార్ మీద ప్రేమెందుకో ?

111
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వచ్చే సంక్రాంతి కి తెలుగులో వారసుడు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ముందుగా ఇది బైలింగ్వెల్ సినిమా అనుకున్నారంతా కానీ మేకర్స్ ఇది పక్కా తమిళ్ సినిమా అని తెలుగులో డబ్బింగ్ గా రానుందని ఇటివలే క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి విజయ్ కి తెలుగులో పెద్ద మార్కెట్ లేదు. తుపాకీ ఓ మోస్తరుగా ఆడింది. ‘అదిరింది’, ‘మాస్టర్’ మాత్రం తెలుగులో మంచి కలెక్షన్స్ తెచ్చాయి. కానీ తెలుగులో ఇప్పుడు విజయ్ మార్కెట్ పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట దిల్ రాజు. ఉన్నట్టుండి విజయ్ పై నిర్మాత దిల్ రాజు అతి ప్రేమ చూపిస్తున్నాడని కొందరు తెలుగు సినిమా అభిమానులు రాజు గారిపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి కనబరుస్తున్నారు.

ఆ మధ్య తుపాకీ రీ రిలీజ్ చేశారు. సరే విజయ్ కి తెలుగులో ఉన్న కొందరు ఫ్యాన్స్ , తమిళ్ ఆడియన్స్ కోసం ఆ సినిమా వేశారని అనుకున్నారంతా. తాజాగా అదిరింది సినిమాకి కూడా హైదరాబాద్ సుదర్శన్ లో ఓ స్పెషల్ షో వేశారు. ఇదే తెలుగు ప్రేక్షకులకు దిల్ రాజు పై సందేహం కలిగిస్తుంది. అసలే సంక్రాంతి కి వారసుడు కి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చిరు , బాలయ్య ఫ్యాన్స్ రాజు పై కోపంగా ఉన్నారు. ఈ సమయంలో విజయ్ లేటెస్ట్ మూవీ అదిరింది స్పెషల్ షో అంటే ఆ కోపానికి ఆద్యం పోసింది. ఇక దిల్ రాజు బేనర్ ట్విట్టర్ లో కూడా విజయ్ పక్కన సార్ అని పెట్టడం కూడా తెలుగు ఆడియన్స్ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఎప్పుడైనా మన తెలుగు స్టార్స్ కి ఇలా సార్ అని పెట్టారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ విజయ్ పై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటం మన తెలుగు ఆడియన్స్ కి నచ్చడం లేదు. తెలుగులో ఒక్క సినిమా ప్రమోషన్ కి కూడా రాని స్టార్ కి ఎందుకు ఇంత సీన్ అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి…

ధమాకాలో వింటేజ్ రవిని చూస్తారు:భీమ్స్

‘బాలయ్య – ప్రియాంక’.. షాకింగ్ కాంబినేషన్

నిర్మాతను బూతులు తిట్టిన హీరోయిన్

- Advertisement -