లకలకలకలక…కంగనా వంతు

137
- Advertisement -

 2005లో సంచలనం సృష్టించిన చంద్రముఖి సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పి.వాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రముఖి2లో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్ కంగనారనౌత్ కీ రోల్‌లో నటిస్తుందని లైకా ప్రొడక్షన్ సంస్థ ప్రకటించింది.

కంగనాతో పాటుగా ప్రముఖ డ్యాన్సర్‌ దర్శకుడు రాఘవ లారెన్స్‌ కూడా కీరోల్‌ పోషిస్తున్నారని ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతుండగా…దీనికి సంబంధించిన ఒక ఫోటోను ట్వీటర్‌లో విడుదల చేశారు. ఇప్పుడు అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. తమిళ లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

ఛత్రపతిగా అక్షయ్‌కుమార్‌…

ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రశాంత్ నీల్ ?

క్యాస్టింగ్ కౌచ్‌…మహానటి స్పందన!

- Advertisement -