‘హాట్’ సమ్మర్‌లో..ఇవి తింటే ‘కూల్’!

7
- Advertisement -

ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పరిధి దాటిపోతున్నాయి. ఈ హాట్ సమ్మర్ లో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోకపోతే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సంభవిస్తాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకునేందుకు నీరు అధికంగా తాగాలి. నీతో పాటు విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పదార్థాలను తినాలి. సమ్మర్ లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలో కీరదోస కూడా ఒకటి. ఇవి మార్కెట్ లో సీజన్ తో సంబంధం లేకుండా లభిస్తూ ఉంటాయి. వీటిలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. అంతే కాకుండా మినరల్స్ కూడా మెండుగా ఉంటాయి, కాబట్టి ఈ సమ్మర్ లో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కీరదోస ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీనిని జ్యూస్ రూపంలో గాని లేదా నేరుగా గా తిన్న అందులోని పోషకాలు డీహైడ్రేషన్ బారినుంచి బయటపడేస్తాయి.

కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి రక్తపోటును తగ్గించి హైబిపి, లోబీపీ లను సమతుల్య పరుస్తాయి. ఇందులో కెలోరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. విటమిన్ కె, సి, పొటాషియం, మెగ్నీషియం కీరదోసలో అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయ పడుతుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరంలో వేడిని అదుపులో ఉంచడంతో పాటు మూత్ర సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా ఇందులో బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్దిగా లభిస్తాయి. కాబట్టి ఈ సమ్మర్ లో కీరదోస అనేది తప్పక తినాల్సిన పదార్థాలలో ఒకటిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని అధికంగా తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తిని కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి ఆరోగ్య సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తింటే ఈ సమ్మర్ లో కీరదోస వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:చైతన్య రావు… ‘పారిజాత పర్వం’

- Advertisement -