రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో బాలీవుడ్ హీరో

332
RRR Ajay Devgan
- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈచిత్రం. తాజాగా రెండవ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ రామోజీ ఫిలీం సిటీలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో ఎన్టీఆర్ బందిపోటుగా, చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం సముద్రఖనిని .. ప్రియమణిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది.

ajay-devgn

తాజాగా ఈచిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటివలే రాజమౌళి అజయ్ దేవగన్ ను కలిసి ఒప్పించినట్టు తెలుస్తుంది. సాధారణంగా అజయ్ దేవగన్ మాట్లాడటం రాని భాషలో నటించడం ఇష్టం ఉండదు అని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ కారణంగానే ఆయన ‘భారతీయుడు 2’ నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా సున్నితంగా తిరస్కరించాడు.

ఈసినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమచారం. దర్శకుడు రాజమౌళి అజయ్ దేవ్ గన్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఈసినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. ఈగ హిందీ వర్షన్ డబ్బింగ్ చెప్పింది అజయ్ నే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన రాజమౌళి సినిమాను అజయ్ దేవగణ్ చేయడం ఖాయమైపోయిందనే అంటున్నారు.

- Advertisement -