త్వరలో హైటెక్‌సిటీకి మెట్రో..

240
hyd metro
- Advertisement -

భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే హైదరాబాద్‌ మెట్రోకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. రోజురోజుకి ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతుండగా తాజాగా మెట్రో మూడో ఫేజ్ ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతుంది. అమీర్‌ పేట నుండి హైటెక్‌ సిటీ వరకు మెట్రోను త్వరలో ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో హైటెక్‌ సిటీ-అమీర్ పేట రూట్‌లో రోలింగ్ స్టాక్స్ పనులను పరిశీలించారు అధికారులు.

సీఎంఆర్‌ఎస్ పరీక్షలు,రూట్ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ వస్తే ఈ రూట్‌లో మెట్రోను అందుబాటులోకి తీసుకురానున్నారు. అమీర్‌ పేట నుండి హైటెక్‌ సిటీకి 11 కిమీల దూరం గల ఈ రూట్‌లో మెట్రో ప్రారంభమైతే ట్రాఫిక్ కష్టాలు మరింత తగ్గే అవకాశం ఉంది.

మొదటిదశలో మియాపూర్‌ నుంచి నాగోల్‌ వరకు 30 కి.మీ. మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తేగా రెండో దశలో ఎల్బీనగర్-అమీర్ పేట 16 కిలోమీటర్ల దూరంలో మెట్రోని ప్రారంభించారు. తాజాగా మూడో దశలో 11 కిమీలు అందుబాటులోకి రానుండగా మొదటిదశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి. ఈ రూట్‌లో కూడా త్వరలో మెట్రో పరుగులు పెట్టనుంది.

- Advertisement -