సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు!

52
sonu sood

సినీ నటుడు సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌. ముంబైలోని జుహూలోని ఆరు అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా సోనుసూద్‌ హోటల్‌గా మార్చారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది బీఎంసీ.

అయితే తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, హోటల్‌గా మార్చేందుకు తన వద్ద బీఎంసీ అనుమతులు ఉన్నాయని, మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎంసీజెడ్‌ఎంఏ) రావాల్సి ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 2020లో బీఎంసీ పంపిన నోటీసును సవాల్‌ చేస్తూ నగర సివిల్ కోర్టును ఆశ్రయించారు సోనూ.మహమ్మారి సమయంలో కొవిడ్‌ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పాడు.