హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం..

35
hima kohli

రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ హిమా కోహ్లీ. ఆమె చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ హైకోర్టుకు మొద‌టి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నిలిచారు హిమా కోహ్లీ. 1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్‌ హిమ కోహ్లీ 1979లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి బీఏ ఆనర్స్‌ హిస్టరీలో పట్టభద్రులయ్యారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు.