పెద్దగట్టు జాతరకు రూ.2 కోట్లు కేటాయింపు

198
peddagattu jathara
- Advertisement -

తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళ లింగమంతులస్వామి (పెద్ద గట్టు) జాతర ఫిబ్రవరి 14 నుండి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు విడుదల చేసింది. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లకు ప్ర‌భుత్వం రూ. 2 కోట్లు కేటాయించ‌డం హర్షణీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యయాదవ్, పెద్దగట్టు జాత‌ర మాజీ చైర్మన్ కడారి సతీష్ యాదవ్‌లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం వ‌ద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

జాతర వివరాలు……

ఫిబ్రవరి 14- 2021 న దిష్టి పూజ

ఫిబ్రవరి 28-2021 ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుండి దేవర పెట్టె తీసుకువచ్చుట, గంపల ప్రదిక్షణ

మార్చి 01 -2021 సోమవారం, బోనాలు సమర్పించుట ముద్దెర పాలు ,జాగిలాలు

మార్చి 02-2021 మంగళ వారం, చంద్రపట్నం

మార్చి 03-2021 బుదవారం, పూజారులు నెలవారం చేయుట

మార్చి 04-2021 గురువారం, జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపు ఉండనుంది.

- Advertisement -