బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు..

163
minister errabelli
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ డివిజన్లలో రాజకీయం వేడెక్కుతున్నది. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ, 4వ డివిజన్లో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో చక్రం తిప్పారు. అభ్యర్థిని వెంటబెట్టుకుని డివిజన్ మొత్తం ఇంటంటికి తిరుగుతూ, ప్రతి ఓటరును ఓట్లు అడిగిన మంత్రి, యువతపై ప్రత్యేక దృష్టి సారించారు. డివిజన్లో గత పరిస్థితుల దృష్ట్యా, టీఆర్ఎస్ కు దూరమైన యూత్ కు ప్రభుత్వ పథకాలు, వాటిని పొందే అవకాశాలు, ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై తగు రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. డివిజన్ ను దత్తత తీసుకుని, ఉద్యోగ అవకాశాలు పెంచుతామని చెప్పారు.

దీంతో యూత్ మంత్రి ఎర్రబెల్లిపై భరోసా ఉంచారు. ఒక్క సారిగా శుక్రవారం రాత్రి ఒక్క రోజే, చైతన్య నగర్, భక్షి గూడ, రాజీవ్ నగర్, అన్నపూర్ణ కాలనీల నుంచి వెయ్యి మందికి పైగా బీజేపీలో ఉన్న యూత్ అంతా టీములు టీములుగా మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. శనివారం రాజీవ్ నగర్ లోనూ 500 మంది బీజేపీ యూత్ టీఆర్ఎస్ లో చేరారు. ఇంకా బయటకు రాలేని కొందరు డివిజన్ బీజేపీ నేతలు సహకరిస్తామని హామీలు ఇచ్చారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి, మిగతా ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. డివిజన్‌లో అన్ని కాలనీలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ప్రభుదాస్‌తో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేశారు.

ఫలితంగా టీఆర్‌ఎస్‌ కే ఓటు వేసి గెలిపిస్తామని 4వ డివిజన్ అపార్టుమెంటు అసోసియేషన్‌లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అధికార పార్టీకే అండగా ఉంటామన్న హౌసింగ్ బోర్డు మునిసిపల్ కార్మికులు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం రాజీవ్ నగర్ లోని క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చి లో పాష్టర్ల ప్రార్థనలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి, అభ్యర్థి ప్రభుదాస్ కి దీవెనలు అందించారు. కాగా, మీర్ పేట డివిజన్ నుంచి ఎల్బీ స్టేడియం సభకు భారీగా జనం తరలి వెళ్ళారు. జనం ర్యాలీని మంత్రి ప్రారంభించారు.

- Advertisement -