బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించండి- కేసీఆర్‌

76
kcr

ఢిల్లీకి వచ్చి ఎక్కడ ఆగం చేస్తాడో అని హైదరాబాద్‌కు నేతలంతా వరదలా వస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా ఢిల్లీకి సందేశం ఇవ్వాలని’ సీఎం కేసీఆర్‌ కోరారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?, దేశం కోసం, ప్రజల మంచి కోసం మాట్లాడటం తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఈ దేశం గతి మార్చాలి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారానే సందేశమివ్వాలి. 30 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?. బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారు? అని సీఎం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు దేశాన్ని పాలించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు.

kcr

యూపీలోనే సక్కగ లేదు, ఆ రాష్ట్ర సీఎం వచ్చి మనకు చెప్తాడా?. 28వ ర్యాంకర్‌ వచ్చి 5వ ర్యాంకర్‌కు చెబుతాడా?. బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించండి. హైదరాబాద్‌కు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దు. భూముల విలువలు, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త. గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ గెలిపించాలి. కేంద్రం మెడలు వంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తాం’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.