బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 84 హైలైట్స్

77
episode 84

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 84 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 84వ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ఈ వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి అడగడం,హారిక బెస్ట్ కెప్టెన్‌ కాదు అని చెప్పడం,అభిజిత్‌కు క్లాస్ పీకడం,మోనాల్ సేవ్ అవ్వడం వంటి ఆసక్తికర సన్నివేశాలతో ఎపిసోడ్ ముగిసింది.

తొలుత బెస్ట్ కెప్టెన్ హారికను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన నాగ్ …గట్టిగా క్లాస్ పీకారు. అభిజిత్‌కు ఫేవర్‌గా కెప్టెన్సీ చేశావని వాస్తవానికి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదని తెలిపాడు నాగ్. అఖిల్ కోసం సోహైల్ నామినేట్ అవడానికి రెడీగా ఉన్న‌ప్ప‌టికీ‌ నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభి కోసం నామినేష‌న్‌లోకి పంపావ‌ని ఇది కరెక్టా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలని చూపిస్తూ హారికను నీ గేమ్ నువ్వు ఆడాలని తెలిపాడు.

తర్వాత సోహైల్ మాట్లాడుతూ‌ త‌ను అరియానాను వెక్కిరించ‌డం త‌ప్ప‌ని చెప్తూ ఆమెకు సారీ చెప్పాడు. అలాగే దెయ్యం టాస్కులో అఖిల్‌, నేను భ‌య‌ప‌డ్డామంటూ చుచ్చు పోసుకున్నామని తెలిపాడు. ఇక ఈరియానా వంతు రాగా ఆమె వ‌ర‌స్ట్ కెప్టెన్ కాద‌ని గుడ్ కెప్టెన్ అని మెచ్చుకున్నారు. అవినాష్‌కు అరియానాతో వ్యవహరించిన విధానం బాగాలేదని చెబుతూ నోరు జారొద్దని వార్నింగ్ ఇచ్చారు. మోనాల్‌.. అఖిల్‌తో స్వాప్ చేయ‌క‌పోవ‌డమే త‌న‌ పొర‌పాటు అని తెలిపింది.

ఇక చివరగా అభి వంతు వచ్చేసరికి బిగ్ బాస్ మెయిన్ డోర్ ఓపెన్ చేయించిన నాగ్…బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయకపోవడం నీ తప్పని తెలిపాడు. ప్రతివారం టాస్క్‌లు ఆడకపోవడం సారీ చెప్పడం నీకు అలవాటుగా మారిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభి..మోనాల్‌తో లింక్ చేయ‌కండ‌ని ఎన్నోసార్లు అభ్య‌ర్థించాను. పైగా దెయ్యంఇచ్చిన టాస్క్‌లో నేను మోనాల్‌ను ఏడిపించాన‌ని చెప్పారు. కానీ నేను ఏడిపించ‌లేద‌ని చెప్ప‌డంతో నాగ్ ఓ వీడియో చూపించారు. అందులో అభిజితే మోనాల్‌ను ఏడిపించిన‌ట్లు ఒప్పుకున్నాడు. దీంతో సారీ చెప్పాడు అభి.

ఇక చివరగా ప‌న్నెండు వారాలు ముగుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చ‌రించినా, న‌వ్వుతూ చెప్పినా ఇంకా స‌రిగా గేమ్ ఆడ‌టం లేద‌ని ఆవేదన చెందిన నాగ్‌… మీ అంద‌రికీ దండం పెడుతున్నా, గేమ్ ఆడండి అంటూ కంటెస్టెంట్ల‌ను చేతులెత్తి వేడుకున్నారు. దీంతో సారీ సార్ అంటూ ఇంటి స‌భ్యులు బాగా ఆడ‌తామ‌ని హామీ ఇచ్చారు. చివరగా మోనాల్‌ సేవ్ కాగా అవినాష్‌కు ఓ పని చెప్పి ఎపిసోడ్‌ని ముగించాడు నాగ్.