బిగ్ బాస్ 5…విశ్వ ఎలిమినేట్

130
vishwa
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుంది. 9వ వారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు విశ్వ. అయితే పోతూ పోతూ కాజల్, ప్రియాంకలకు షాకిచ్చాడు విశ్వ.

ముందుగా సండే ఫన్‌ డే లో భాగంగా కంటెస్టెంట్లతో డిఫరెంట్ గేమ్స్‌ను ఆడించాడు నాగ్. బొమ్మ అక్కడ పాట ఇక్కడ అనే ఆటను ఆడించాడు. ఈ ఆటలో జెస్సీని సంచాలకుడిగా నియమించాడు. షన్ను, సన్నీ, ప్రియాంక, కాజల్, విశ్వలను ఓ టీంగా మిగిలిన రవి, సిరి, శ్రీరామచంద్ర, మానస్, ఆనీ మాస్టర్లను మరో టీంగా విభజించాడు. హీరో హీరోయిన్ల బొమ్మలను గుర్తు పట్టి, వారి కాస్ట్యూమ్ ఆధారంగా అది ఏ పాట అయి ఉంటుందో గెస్ చేయాలని అన్నాడు.

మొదట రవి విశ్వలు వచ్చారు. వారికి అల వైకుంఠపురములోంచి రాములో రాముల పాటకు సంబంధించిన బొమ్మలను ఇచ్చాడు. రవి తొందరగా రవి గెస్ చేశాడు. విశ్వ ఓడిపోయాడు.. రాములో రాముల పాటను రవి ఇట్టే చెప్పేశాడు. సిరి, షన్నులు వచ్చారు. షన్ను గంట కొట్టాడు కానీ టెంపర్ పాట అని షన్ను సరిగ్గా గెస్ చేయలేకపోయాడు. దీంతో షన్ను టీం మైనస్ పాయింట్‌లోకి వెళ్లిపోయింది.

తర్వాత మానస్, సన్నీలు వచ్చారు. వారికి గబ్బర్ సింగ్ నుంచి పిల్లా నువ్వులేని జీవితం అనే పాటకు సంబంధించిన బొమ్మలు వచ్చాయి. మానస్ ముందుగా వెళ్లి గంటను కొట్టాడు. హీరోయిన్ పేరు తప్పుగా చెప్పినా కూడా పాటను కరెక్ట్‌గా చెప్పాడు. అలా రవి టీంకు మరో పాయింట్ వచ్చింది. కాజల్, శ్రీరామచంద్ర రాగా శ్రీరామచంద్ర గంట కొట్టేశాడు. ఖైదీ నంబర్ 150 నుంచి సుందరి పాట అని గెస్ చేశాడు. అలా రవి టీంకు మళ్లీ ఓ పాయింట్ వచ్చింది.

ఆనీ, ప్రియాంకలు రాగా ప్రియాంక గెస్ చేసి కరెక్ట్ చెప్పగా షన్ను టీం మైనస్ లోంచి జీరోకు వచ్చింది. ఆ తరువాత నాగార్జున అనుష్క ఢమరుకం పాటను గుర్తు పట్టలేకపోయారెవ్వరూ. ప్రియాంక, రవి వచ్చారు.. ప్రియాంక గంట కొట్టినా కూడా పాటను గెస్ చేయలేదు.దీంతో షన్ను టీం డిస్ క్వాలిఫై అయింది. అలా రవి టీం గెలిచింది.

తర్వాత నేను ఎవరిని అంటూ.. ఒక్కో కంటెస్టెంట్‌కు మిగతా కంటెస్టెంట్లకు సంబంధించిన పేరు వస్తుంది. వారిని ఇమిటేట్ చేసి చూపించాలి. అలా ఏ టీంలోంచి సభ్యులు వస్తే.. ఆ టీంకు సంబంధించిన మిగతా సభ్యులు గెస్ చేయాలి. తొలుతు సన్నీకి సిరి పేరు వచ్చింది. దీంతో సిరిలా ఇమిటేట్ చేశాడు. విశ్వ వెంటనే గెస్ చేశాడు. గేమ్స్ ఆడిస్తూనే ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరకు విశ్వ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హౌస్‌ నుండి బయటకు వచ్చిన విశ్వ తన జర్నీని చూసి ఎమోషనల్ అయ్యాడు.

ఇక వెళ్లేముందు విశ్వకు టాస్క్‌ ఇచ్చాడు నాగ్. ఇంట్లో పది మంది సభ్యులున్నారు. వారికి ర్యాంక్స్ ఇవ్వమని అన్నాడు. అలా చివరి నుంచి వచ్చిన విశ్వ.. పదో స్థానంలో ప్రియాంకను పెట్టాడు. కాజల్‌ను తొమ్మిదో స్థానంలో ,జెస్సీని ఏడో స్థానంకు పరిమితం చేశాడు.మానస్‌ను ఆరో స్థానంలో ,సిరిని ఐదో స్థానంలో పెట్టేశాడు.సన్నీకి నాల్గో స్థానాన్ని,షన్నుకు మూడో స్థానాన్ని,రవికి రెండో స్థానాన్ని,శ్రీరామచంద్రకు నెంబన్ వన్ స్ధానాన్ని ఇచ్చాడు.

- Advertisement -