మరో వివాదంలో ఫేస్ బుక్..

123
fb
- Advertisement -

ఫేస్ బుక్‌ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఫేస్ బుక్ యూజర్స్ డేటా లీక్ అయిందని ఆరోపణలు రావడంతో మాతృసంస్థ పేరును మెటాగా మార్చారు జూకర్ బర్గ్. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్‌ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ కోర్టును ఆశ్రయించారు. రీబ్రాండింగ్‌ పేరిట ఫేస్‌ బుక్‌ తమ సంస్థ పేరును దొంగలించిందని ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఫేస్‌బుక్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినందుకే ఇలా చేసిందని ఆయన వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని విమర్శించారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు.మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్‌ లాయర్లు వెంటాడుతున్నారని నేట్‌ చెప్పారు. తాము ఫేస్‌బుక్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపాడు.

- Advertisement -