బిగ్ బాస్ 5…‘మట్టిలో మహాయుద్ధం’

58
bb5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 31 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. జెస్సీ మీద కోపంతో శ్రీరామ్ ఎవరి వంట వారే చేసుకోవాలని ఆవేశంగా అన్న మాటలతో చిచ్చురాజుకోగా అటు షణ్ముఖ్, జెస్సీ, సిరి – ఇటు కెప్టెన్ శ్రీరామ్, హమీద డిన్నర్ చేయకుండానే పడుకున్నారు. తర్వాత ఈ వివాదాన్ని తెగే వరకూ లాగకూడదని మర్నాడు ఉదయాన్నే ఏం జరగనట్టే ప్రవర్తించడం మొదలెట్టారు.

తర్వాత బిగ్ బాస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ గురించి ప్రచారం చేసుకుంది అమెజాన్. గార్డెన్ ఏరియాలో నాలుగు స్టాండీస్ ను ఏర్పాటు చేసి, నలుగురు కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి వాటిపై ఉన్న పరదాలు తొలగించమని కాజల్ ద్వారా చెప్పింది. కంటెస్టెంట్స్ లో నలుగురిని ఎంపిక చేసుకునే హక్కు కెప్టెన్ గా శ్రీరామ్ కు బిగ్ బాస్ అప్పగించాడు. దాంతో ప్రియ, మానస్, షణ్ముఖ్‌, హమీదాలను అతను ఎంపిక చేశాడు. ప్రియా స్టాండీపై పరదా తొలగించగానే ఆమెకు టీవీ బహుమతిగా వచ్చింది.

ఆ తర్వాత హై ఎండ్‌ కంప్యూటర్ షణ్ముఖ్ కు రాగా హమీదకు మొబైల్ ఫోన్,మానస్‌కు రిస్ట్ వాచ్ వచ్చింది. ఇక కెప్టెన్సీ టాస్క్ కు ముందు కాజల్, లోబో, రవి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. నెల రోజుల పాటు బాత్ రూమ్ పనులకే పరిమితమైన రవి, లోబో ఇకపైన వంట చేయాల్సి రావడంతో వారిని కాజల్ ఆటపట్టించింది. దీంతో రవి తన అసహనం వ్యక్తం చేయగా, లోబో మాత్రం తెలివిగా తన మిడిల్‌ ఫింగర్ ను క్యాజువల్ గా సీలింగ్ వైపు చూస్తున్నట్టుగా చూపించాడు.

తమని కాజల్ ప్రొవోక్ చేయడం వల్లే లోబో అలా రియాక్ట్ అయ్యాడని, ఎగతాళి చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని దాటితే ఇలాంటి ప్రతిస్పందనే వస్తుందని గట్టిగానే కాజల్ కు చెప్పాడు. దాంతో ఆమె కూడా రవి మీద ఆవేశపడింది. వీరిద్దరికీ సర్ధిచెప్పే ప్రయత్నం కెప్టెన్ గా శ్రీరామ్ చేయడం మొదలెట్టాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’ అని వ్వగా ఇందులో రవి, సన్నీలను బిగ్ బాస్ రాజకుమారులుగా నియమించాడు. మిగిలిన పార్టిసిపెంట్స్ అంతా ప్రజలు. ఆట పూర్తయ్యే సరికీ ఎవరికి ఎక్కువ మంది ప్రజల మద్దత్తు ఉంటుందో, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారు గెలిచినట్టు.

మట్టిలో మహా యుద్ధం అనే టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో వెస్లింగ్ పిట్ ను ఏర్పాటు చేసిన బిగ్ బాస్ ఇద్దరు రాజకుమారుల టీమ్ నుండి ముగ్గురేసి సభ్యులను పోటీకి దింపమని చెప్పాడు. మహిళలు మహిళలతోనే పోరాడాలని రవి చెప్పిన సలహాను సన్నీ తిరస్కరించాడు. తన దగ్గర మహిళలు తక్కువ ఉన్నారని, కాబట్టి తాను మగవాళ్ళనే బరిలోకి దించుతానని చెప్పాడు. అది అన్ ఫెయిర్ అని రవి చెప్పడంతో గతంలో కట్టెలు కొట్టే టాస్క్ సమయంలో రవి- విశ్వ… తమకు పోటీగా ప్రియా, ప్రియాంకలను ఎంపిక చేసుకోవడం అన్ ఫెయిర్ కాదా? అని సన్నీ ఎదురు దాడికి దిగాడు. అప్పుడు కరెక్ట్ అయ్యింది? ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగనుంది.