బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 74 హైలైట్స్

31
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 74 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 74వ ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో సన్నీకి పవర్ టూల్ లభించడంతో.. రెండు కవర్లు ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకుని పవర్‌ని ఉపయోగించమని తెలిపారు బిగ్ బాస్.

సన్నీ ఎంచుకున్న కవర్‌లో.. ఒక ఇంటి సభ్యుడి దగ్గర నుంచి ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని ఉండటంతో.. సిరి దగ్గర ముత్యాలను తీసుకుని మానస్‌కి ఇస్తానని చెప్పాడు. అయితే షణ్ముఖ్‌ ప్రపోజల్‌తో తన నిర్ణయం మార్చుకుంటూ సిరి దగ్గర తీసుకుని షణ్ముఖ్‌కి ఇస్తున్నట్టు చెప్పాడు. దీంతో షణ్ముఖ్.. సన్నీకి హగ్ ఇస్తూ బ్రిడ్జి కట్టేశావ్ అని అన్నాడు.

తర్వాత షణ్ముఖ్ వచ్చి సన్నీకి థాంక్స్ చెప్పగా.. సిరి నో అనేసింది. తర్వాత ఎక్కువ గోల్డ్ కాయిన్స్ సంపాదించిన మానస్, ప్రియాంకలు మొదటి కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. దీంతో వాళ్లిద్దరికీ ఎయిర్ పంప్‌తో పాటు బెలూన్స్ ఇచ్చి.. గాలి పట్టాలని ఎక్కువగా ఎవరైతే ఎక్కువ బెలూన్స్‌ని బ్లాస్ట్ చేస్తారో వాళ్లే గెలిచినట్టని చెప్పారు. ఈ టాస్క్‌లో మానస్‌పై ప్రియాంక గెలిచి మొదటి కెప్టెన్ పోటీదారునిగా నిలిచింది.

ఇక అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే.. రవి కాయిన్స్‌ని కొట్టేసింది సిరి. అది చూసిన షణ్ముఖ్.. వరస్ట్‌ రా నువ్.. అన్నీ దొబ్బుడే నీకంటే నేనే బెటర్ అనగా ఇది గేమ్‌ రా అని చెప్పి సంతోషపడింది సిరి. తర్వాత కాజల్ బౌల్ నుంచి కాయిన్స్ నొక్కేయగా కాజల్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన గోల్డ్ మైన్‌లోని కాయిన్స్ నొక్కేసి.. మళ్లీ తిరిగి అందులోనే పడేసింది.

తర్వాత రవి-సిరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నాకు మీ ఇద్దరిని చూస్తే భయంగా ఉంది మీ ఇద్దర్నీ చూస్తే.. ఒకరికోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా సిద్ధమైనట్టు అనిపిస్తుంది అనగా అదేం లేదు.. వాడు బాగా ట్రిప్ అవుతున్నాడు.. అంతే అని సిరి చెప్పగా.. కేవలం నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో అది ఆలోచించు అని చెప్పాడు.