బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 34 హైలైట్స్

29
bb5

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 34 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 34వ ఎపిసోడ్‌లో భాగంగా కాజల్‌ని టార్గెట్ చేసిన రవి..ఆమెను జైలుకు పంపించారు. కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా ప్రియ ఈవారం కెప్టెన్ అయింది.

కొత్త కొప్టెన్‌గా ఎంపిక అయిన ప్రియను యాంకర్ రవి తన సహజ సిద్ధంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఎవరికి ఏం వర్క్ ఇవ్వాలి? ఎవర్ని రేషన్ మేనేజర్‌గా కేటాయించాలని అన్నదానిపై యాంకర్ రవి సలహాలు ఇచ్చాడు. మానస్‌ని ఇష్టపడుతున్నట్టుగా టీం సభ్యులతో చెప్పింది పింకీ. దీంతో ఆమెకి మానస్‌కి మధ్య ఏదో నడుస్తుందని హౌస్‌లోకి గాసిప్ బ్యాచ్ చెవులు కొరుక్కుండటంతో మానస్ పింకీని దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చి పింకీని బాధపెట్టాడు.

కాజల్‌ని టార్గెట్ చేసిన రవి…ప్రియతో కాజల్‌కు చిన్న గాయమే అయింది తప్ప పెద్దది కాలేదన్నారు. ఇక ఈవారం చెత్త పర్ఫామర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులను అడగ్గా మెజార్టీ సభ్యులు కాజల్ పేరును చెప్పారు. దీంతో ఆమెను జైలు‌లో వేసి తాళం వేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు దీంతో కాజల్ జైలు పాలైంది. ఈ టాస్క్ మొత్తంలో హైలైట్ ఏంటంటే.. పద్దతిగా ఎలా ఉండాలో యాంకర్ రవి పాఠం చెప్పడం.. ప్రియ విషయంలో.. లహరి విషయంలో మనోడి పద్దతిని కెమెరాల సాక్షిగా బయటపెట్టారు.