భారీ వర్షాలు..అధికాలతో సీఎండీ రఘురామ టెలీకాన్ఫరెన్స్‌

17
cmd

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్ల, సుపరెంటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎండీ జి రఘుమా రెడ్డి.

భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్/ స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం రాత్రంతా భారీ వర్షం గాలులు కలిగే అవకాశమున్నందున FOC / CBD సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు.

విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగినచో సిబ్బంది విధిగా భద్రత చర్యలు పాటిస్తూ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. క్రిందకు వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్ల కు దూరంగా ఉండాలి, వాటిని తాకొద్దన్నారు. క్రింద పడ్డ/ వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుండి వాహనాల తో డ్రైవ్ చేయడం, వైర్లను తొక్కడం చేయరాదన్నారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయరాదన్నారు.

విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరన్నారు.