బిగ్ బాస్ 5…ఎలినిమినేషన్ కు ముందే ప్రోమో!

31
bb5

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విజయవంతంగా 5 వారాలు పూర్తిచేసుకుంది. ఐదో వారంలో భాగంగా హమీదా ఇంటి నుండి ఎలిమినేట్‌ కాగా హౌస్ లోని సభ్యులందరినీ రెండు టీమ్స్ గా చేసి, ఏకంగా తొమ్మిది పోటీలు పెట్టి, తొమ్మిది అవార్డులను విన్నింగ్ టీమ్ కు ఇచ్చారు.

ఇక ఆదివారం ఎలిమినేషన్ ఎవరూ కాబోతున్నారా అనే ఉత్కంఠ నెలకొనగా అంతే సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటేన్ చేసి చివరకు రివీల్ చేస్తారు. కానీ ఈ 5వ వారం ఎలిమినేషన్ ఎవరనేది ముందుగానే తెలిసిపోయింది.

పొరపాటున షోలో ఆ మర్నాడు ప్రదర్శించే ఎలిమినేటర్స్ ఇంటర్వ్యూ ప్రోమోను ప్లే చేశారు. అందులో హమీదాను అరియానా ఇంటర్వ్యూ చేస్తూ ఉండటంతో ఎలిమినేట్ అవ్వబోతోంది హమీదా అనేది ముందే లీక్ చేసినట్టు అయిపోయింది.

ఇక హమీదా కోసం శ్రీరామచంద్ర పాడిన పాట అందరిని ఆకట్టకుంది. నాగ్ పాటపాడమని కోరగానే నా హృదయంలో నిదురించే చెలీ పాట పాడాడు. దీంతో హమీదా కంటతడి ఆపుకోలేకపోయింది.