బిగ్ బాస్ 4… ఎలిమినేట్ అయ్యేది వీరిలో ఒకరేనా..?

174
bigg boss 4

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 25 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 4వ వారంలో ఏడుగురు హారిక, స్వాతి దీక్షిత్,అభిజిత్,లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఇందులో కుమార్ సాయి వచ్చే వారం కెప్టెన్‌గా ఎంపికవడంతో ఎలిమినేషన్ నుండి తప్పుకున్నట్లు అయింది.

ఇప్పటివరకు 2 లక్షల 19 వేల 633 మంది ఓటు వేయగా 25.24 శాతం ఓట్లతో అభిజిత్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తర్వాత మెహబూబ్ 12.78,కుమార్ సాయి 12.74,సొహైల్ 12.36,హారిక 12.35,లాస్య 12.30,స్వాతి దీక్షిత్ 12.2 శాతంతో ఉన్నారు.

ప్రతీవారం లీస్ట్‌లో ఉన్న వారు ఎలిమినేట్ అవుతుండటంతో ఈ వారం లీస్ట్‌లో హారిక,లాస్య,స్వాతి దీక్షిత్ ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోననే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటివారంలో సూర్యకిరణ్,రెండవ వారంలో కరాటే కళ్యాణి,మూడో వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు.