ఓటింగ్ ట్రెండ్‌…బిగ్ బాస్‌ విన్నర్ అతడేనా!

60
bigg boss 4

బిగ్ బాస్ 4 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్‌లు అభిజిత్,అఖిల్,సొహైల్,హారిక,అరియానా ఉండగా వీరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలుస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇక లాస్ట్ వీక్ ఓటింగ్‌లో పెద్ద ఎత్తున ప్రేక్షకులు పాల్గొంటున్నారు. ఇక ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు అభిజిత్. 54.94 శాతం ఓట్లతో అభిజిత్ టాప్‌లో ఉండగా అరియానా 18.01 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. మూడో స్ధానంలో 13.58శాతం ఓట్లతో సొహైల్ ఉండగా అఖిల్ 8.65,హారిక 4.82 శాతం ఓట్లతో తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న అభిజిత్‌ విన్నర్‌గా నిలుస్తారా లేదా మరేదైన సమీకరణలను పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటిస్తారో వేచిచూడాలి.

ఇక ఈ సీజన్‌ చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చేతుల మీదుగా విన్నర్‌ని ప్రకటించనున్నారు. ఇక గత మూడు సీజన్‌లకు రాని విధంగా ఈసారి బిగ్‌ బాస్‌కు రేటింగ్ వచ్చింది.