బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 94 హైలైట్స్

209
episode 94
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 94 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 94వ ఎపిసోడ్‌లో భాగంగా అరియానా-మోనాల్ మధ్య వాగ్వాదం జరగగా మోనాల్ తెగ బాధపడిపోయింది.

తొలుత ఓపిక అనే టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు ఏ హావభావం లేకుండా రోబోట్‌లా కూర్చొని ఉండాలని బిగ్ బాస్ సూచించారు. ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటుచేసిన టేబుల్‌పై రోబోట్‌లా కూర్చోవాలి. మిగిలిన ఇంటి సభ్యులు ఏదైనా చేసి కూర్చున్న సభ్యుడిని నుంచి వీలైనన్ని ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టాలి… టాస్క్ ముగిసే సమయానికి ఏ సభ్యుడు ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారో అఖిల్ బోర్డుపై రాయాలని తెలిపారు.

ఈ టాస్క్‌లో భాగంగా మొదటి ఛాన్స్ అరియానాకు వచ్చింది. ఆమెతో ఎక్స్‌ప్రెషన్స్ తెప్పించడానికి సోహెల్, మోనల్ బాగానే ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఇక చివరగా అరియానా నుండి హావభావాలను తెప్పించడానికి ఆమెకు ఎంతో ఇష్టమైన చింటు బొమ్మను హారిక తీసుకురాగా అరియానా మాత్రం కేవలం 4 ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే ఇచ్చింది.

ఈ టాస్క్‌లో మోనాల్‌ని చదివేశానని మండిపడిన అరియానా…నాపై మనసులో చాలా ఉంది ఆమెకి. టాస్క్ టాస్క్‌లా తీసుకోదు.. పర్శనల్‌గా పెట్టుకుంటుందని మండిపడింది. తర్వాత టాస్క్‌లో మోనాల్ పాల్గొనగా అరియానా ఆటాడుకుంది.

టాస్క్‌లో ఉన్నప్పుడు ఏం మాట్లాడని మోనాల్….. టాస్క్ పూర్తయిన తరవాత తీవ్ర భావోద్వేగానికి గురైంది. జస్ట్ ఐస్ పెట్టినందుకు, బొమ్మ విసిరినందుకు ఇంత నెగిటివ్‌గా తీసుకుంటారా అని కంటతడి పెట్టేసింది. మోనాల్ ఏడుపు చూసిన అరియానా భయంతో బయటకు పరుగు పెట్టింది. ఆ తరవాత మోనల్‌ను కన్‌ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్ ఆమెకు ధైర్యం చెప్పారు.

- Advertisement -