బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 46 హైలైట్స్‌

23
episode 46

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 46 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. గురువారం ఎపిసోడ్‌లో భాగంగా రాక్షసులపై మంచి మనుషులు విజయం సాధించగా అరియానా టార్చర్,అఖిల్ వర్సెస్ మెహబూబ్‌ మాటల యుద్దంతో సరదాగా గడిచిపోయింది.

తొలి టాస్క్‌లో భాగంగా ఒక సర్కిల్ గీసి అందులో మంచి మనుషులు ఉండాలని.. ఆ సర్కిల్‌లో ఉంచిన మూటలు సర్కిల్ బయటకు విసిరేస్తూ ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కిల్ బయటకు రాకూడదని కండిషన్ పెట్టారు. అయితే మంచి మనుషుల టీం సభ్యులు బయటకు రావడంతో రాక్షసుల టీంను విజేతగా ప్రకటించారు బిగ్ బాస్.

ఇక రాక్షసుల టీంలో మెహబూబ్, అరియానా, అవినాష్ మంచి మనుషులకు చెమటలు పట్టించారు. ముఖ్యంగా అరియానా రాక్షస అవతారంలో జీవించేస్తోంది. ఇంకా టార్చ‌ర్ చేయాల‌నుంది అంటూ సోహైల్, అఖిల్ షూల‌ను ఎక్క‌డ‌పడితే అక్క‌డ విసిరేసింది. పైగా అఖిల్‌తో సారీ చెప్పించుకుంది. క‌ళ్ల ముందు జ‌రుగుతున్న ఘోరాల‌ను చూసి లాస్య ఏడ్వ‌లేక న‌వ్వింది. మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్.. లాస్య అరియానా-అవినాష్‌లపై పంచ్‌ వేసింది. అవినాష్ రాక్షసుడిగా నటిస్తూనే అరియానా, మోనాల్‌లతో రొమాన్స్ చేశాడు.

తర్వాత కుండలతో నీళ్లు తెచ్చి డ్రమ్స్ నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వాళ్లు డ్రమ్స్ నింపుతుంటే రాక్షసుల టీం అడ్డుపడాలని తెలపగా ఈ టాస్క్‌లో భాగంగా మెహబూబ్-అఖిల్ మధ్య మాటల యుద్దం నెలకొంది. అయితే చివరగా రెండు డ్రమ్స్ నిండటంతో మంచి మనుషులు టీంని విజేతగా ప్రకటించారు. దీంతో అవినాష్ మంచి మనిషిగా మారిపోయాడు.

ఇక చివరి టాస్క్‌లో భాగంగా మిగిలిన ఇద్దరు కొంటె రాక్షసులు అరియానా, మెహబూబ్‌లలో ఒకర్ని ఎత్తుకుని బజర్ మోగేసమయానికి నేలపై ఉంచకుండా చూసుకోవాలని మంచి మనుషులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో అరియానాను మాస్టర్ ఎత్తుకుని నిలబడటంతో మంచి మనుషులు విజయం సాధించారు.

ఇక ఈ టాస్క్‌ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఇంటి సభ్యుల్ని అభినందిస్తూ ఇద్దరు బెస్ట్, ఇద్దరు వరెస్ట్ పెర్ఫామర్ల పేర్లను తెలపాలని కోరగా మంచి మనుషుల టీం బిగ్ బాస్‌నే చెప్పాలని కోరారు. దీంతో కోపం వచ్చిన బిగ్ పేర్లు చెప్పకపోతే ఇంటి సభ్యులంతా నేరుగా ఎలిమినేట్ అవుతారని తెలపగా అరియానా, అవినాష్‌లు బెస్ట్ పెర్ఫామర్లుగా ప్రకటించాడు నోయల్. వీరిద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. ఇక వరస్ట్ పెర్ఫామర్స్ ఎవరో తేల్చుకోలేని కారణంగా అరియానా, అవినాష్ మినహా ఇంటి సభ్యులంతా ఇంటిని శుభ్రంగా మార్చుకోవాలని కోరారు బిగ్ బాస్.