బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 39 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 39వ ఎపిసోడ్‌లో కెప్టెన్‌గా నోయల్ ఎంపికవడం,అవినాష్-సొహైల్ మధ్య మాటల యుద్దం,సొహైల్ కంటతడి,అరియానా-అఖిల్ టీం వేర్వేరు అయినా టాస్క్ సందర్భంగా టీమ్ స్పిరిట్ ప్రదర్శిస్తూ ముందుకుసాగడం వంటివి హైలైట్‌గా నిలిచాయి.
అమీతుమీ టాస్క్ డీల్ 7లో భాగంగా ఇంటి సభ్యుల్లో ఒకరు తల గెడ్డం సగం షేవ్ చేసుకోవాలని ఆదేశించారు బిగ్ బాస్. ఈ డీల్ చేయడానికి 40 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని తొలుత అమ్మ రాజశేఖర్ ముందుకురాగా తన తల్లి చనిపోయినప్పుడు కూడా జుట్టు తీసుకోలేదని.. దానికే వచ్చిందని ఇది చేస్తా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.అయితే ఇంటి సభ్యులు అంతా వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు మాస్టర్. తర్వాత అరియానా టీంకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వగా వారు కూడా డీల్ వదులుకున్నారు.
తర్వాత పేడ కలిగిఉన్న బాత్ టబ్‌లో ఉన్న 100 బటన్స్‌ని వెతికి తీయాలని మరో డీల్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ డీల్ చేయడానికి 30 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉండగా అఖిల్ బెల్ మోగించాడు. దివి పేడలో దిగి 100 కాయిన్స్ వెతికితీయడానికి ముందుకు వచ్చింది. ఈ టాస్క్ కొనసాగుతుండగానే మొహానికి స్టోకింగ్ వేసుకుని అరటి పళ్లు తినాలని చెప్పగా అవినాష్ తిని 10 బంగారు నాణేలు చెల్లించారు.
తర్వాత గార్డెన్ ఏరియాలో ఒక సభ్యుడు కుర్చీలో కూర్చుని ఉండాలని స్టోర్ రూం ద్వారా పంపించే వస్తువులను ఉపయోగించి ఇంటి సభ్యులు కుర్చీలో కూర్చొని ఉండాలని ఆ సభ్యుడు లేచేవరకూ వాష్ చేస్తూ ఉండాలని తెలపగా అఖిల్ పోరాడి గెలిచాడు. అఖిల్‌ని ఓడించేందుకు అరియానా టీం సభ్యులు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు.
ఇక దివికిచ్చిన టాస్క్ సమయం ముగియడంతో బెల్ మోగించాడు బిగ్ బాస్. దీంతో 100కి గానూ 93 బటన్స్ మాత్రమే వెతికి తీయగలిగింది. దీంతో టాస్క్‌లో అఖిల్ టీం ఓడిపోగా దివి కంటతడి పెట్టింది. తర్వాత అఖిల్ టాస్క్ పూర్తైన తరువాత మోనాల్ అపోజిట్ టీంలో ఉన్నా అతనికి సపర్యలు చేస్తూ తన ప్రేమను చూపించింది.
ఇక తర్వాత కెప్టెన్ సొహైల్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు అవినాష్. అసలు కెప్టెన్‌గా సొహైల్ పనికిరాడని దివి టబ్‌లో నుంచి దిగి బయటకు వచ్చినా నువ్ ఎందుకు చూడలేదు అని అవినాష్ వాదించడంతో అలా దిగితే ఔట్ అని బిగ్ బాస్ చెప్పలేదు అది సంచాలకుడిగా నా ఇష్టం అనిచెప్పాడు సొహైల్. చూడండి బిగ్ బాస్ ఇక్కడ ఇలాంటివి జరిగితే నేను.. నెక్స్ట్ టాస్క్ కూడా ఆడను.. మీరు ఎలిమినేట్ చేసి పంపించేయాలంటే పంపించేయండి అంటూ తెలిపాడు. కోపం వచ్చినప్పుడు కోపం వస్తాది.. నవ్వించినప్పుడు నవ్విస్తా.. బరాబర్ సేఫ్ గేమ్ ఆడతా..జాగ్రత్తగా ఆడటానికి వచ్చా అని తెలపగా సొహైల్ సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్లి కుర్చీని గట్టిగా కొట్టేశాడు సొహైల్. అఖిల్ వెళ్లి సొహైల్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. మోహబూబ్ కూడా వెళ్లి కూల్ చేయడంతో కంటతడి పెట్టాడు.
ఇక చివరగా సెల్ఫ్ నామినేషన్ టాస్క్ ఇవ్వగా దీనిని అఖిల్ టీం నుండి నోయల్ స్వీకరించారు. దీంతో అమీతుమీ టాస్క్ పూర్తి కాగా అరియానా రెడ్ టీం దగ్గర 70 గోల్డ్ కాయిన్స్ ఉండటంతో.. అఖిల్ బ్లూ టీం దగ్గర 110 కాయిన్స్ ఉండటంతో బ్లూ టీం ఈ టాస్క్‌లో గెలుపొంది.. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
తర్వాత అఖిల్-మోనాల్‌లు ఎప్పటిలాగే తమ రొమాన్స్‌కు తెరలేపారు. మిర్రర్ ఇమేజ్ అంటూ ఎదురెదురుగా కూర్చొని ప్రేమ మత్తులో తేలారు. మొన్న కనిపించావు.. మైమరచిపోయాను.. అందాలతో నన్ను తూట్లు పొడిచేశావు అంటూ మెనాల్‌ని ఇంప్రెస్ చేయగా సిగ్గుపడిపోయింది మోనాల్. తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కొట్టు తలతో ఢీ కొట్టు అనే టాస్క్ ఇవ్వగా తలకి బ్యాట్ హెల్మెట్ ధరించి.. బాల్స్ గోల్ నెట్‌లో వేయాల్సి ఉంటుందని ఎక్కువ బాల్స్ నెట్‌లో ఎవరు వేస్తే వాళ్లే విజేతగా నిలవడంతో పాటు అతనే హౌస్ కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్‌కి అవినాష్‌ని సంచాలకుడిగా నియమించారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో నోయల్ విజేతగా నిలవడంతో కెప్టెన్‌గా ఎన్నికయ్యారు అయితే అమీతుమీ టాస్క్‌లో సెల్ప్ నామినేట్ కావడంతో వచ్చేవారం నామినేషన్‌లో ఉంటావని తెలిపారు బిగ్ బాస్. తర్వాత కెప్టెన్‌గా రేషన్ మేనేజర్‌గా మెహబూబ్‌కి ఛాన్స్ ఇచ్చారు నోయల్.దీంతో ఎపిసోడ్ ముగిసింది.