బిగ్ బాస్ సీజన్ 4..ఐదో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ అనంతరం హౌస్‌లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇంటి సభ్యులైన లాస్య,మొనాల్ కంటతడి పెట్టడం , నోయల్‌కి వ్యతిరేకంగా గ్రూపు ఏర్పడటం,అమ్మ రాజశేఖర్…నోయల్‌పై నిప్పులు చెరిగారు,.
ఇక తనను నోయల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజ శేఖర్ బాధలో ఉండగా ఆయన దగ్గరకు వెళ్లి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు నోయల్. స్వాతిని ఇంప్రెస్ చేయాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఇంప్రెస్ చేయలేను కాని హౌస్ ఫ్రెండ్‌గా మాత్రం ఉంటానని చెప్పాను అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం నచ్చలేదని తెలిపారు నోయల్.
దీంతో నోయల్‌పై తీవ్రంగా మండిపడ్డారు మాస్టర్. నీ కథలు నా దగ్గర చెప్పకు నోయల్.. పోయి చిన్న పిల్లల దగ్గర చెప్పుకో.. నేను డైరెక్షన్ చేశా.. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం అందర్నీ చంపేస్తా అని కథలు చెప్పకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్ గేమ్ ఆడుతున్నావ్.. సినిమా డైలాగ్‌లు చెప్పకు… అబ్బాయి కోసం నువ్ చేస్తే బాగుండేది, అమ్మాయి కోసం ఇలా చేస్తావా?? అంటూ ప్రశ్నించారు.
అమ్మా రాజశేఖర్‌ని బయటకు పంపాలని ప్లాన్ చేశావ్,అమ్మాయి కోసం స్నేహితుడ్ని బయటకు పంపేస్తావా?? పెళ్లి చేసుకున్నావ్ కదా అని అమ్మను బయటకు పంపేస్తావా?? అంటూ ఎమోషనల్ అయ్యాడు. నాతో నాలుగు వారాలు ఉన్నావ్.. ఆమె వచ్చి ఒక వారం అయ్యింది.. నాలుగు వారాలు నాతో ఉన్న కనెక్షన్ కంటే వన్ వీక్ కనెక్షన్ స్ట్రాంగ్ అని నన్ను నామినేట్ చేశావ్…నువ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తే.. వెళ్లి ప్రేమించుకో నాకు అనవసరం.. నా భార్య కోసం నేను ఎనిమిదేళ్లు పోరాటం చేశా అంటూ చెప్పారు.